Sai Sharanam
నీలో నేను నాలో నీవు ఇరువురం ఒకరే సాయి
ఈ పరమార్థం భోధ పరచి జ్ఞానోదయం కలిగించావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
ఇందులో అందులో వీరిలో వారిలో అంతా నీవే స్వామీ
భిన్నత్వం రూపుమాపి ఏకత్వం అలవరుచుకోమన్నావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీగురు
పశు ప్రవుత్తులు అణుచుకుని
మానవ విలువలు పెంచుకుని
మనిషిలా జీవించ మన్నావు
జయ గురు,సద్గురు సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
మానవత్వాన్ని మరిచి మరిచిన మనిషి
ప్రేమతత్వాన్ని నేర్చి దివ్యత్వాన్ని పొందాలని పరితపించావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
మానవ రూపం దాల్చిన పరమేశా
దివ్య సందేశాలిచ్చి మమ్ము పవిత్రం చేసావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
అవతార పురుషా మహానుభావా మాలో ఒకడివై
మాయ చేస్తూ భువిపై సంచరించావు
జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు
మా జన్మ ధన్యమాయే కదా నీ అపార దయ వలన
ఏ లోకాన ఉన్నా దీవిస్తూ ఉండు కురిపిస్తూ నీ కరుణ
జయ గురు సద్గురు సాయి గురు మహా గురు శరణం శ్రీ గురు