Friday, July 27, 2012

Bangaaru Sai








భక్త వత్సలా నా బాధ బాపగ రావేలా ?

శ్రిత  జన పోషా నా మొర విన రావా దేవా 

భగవాన్  నీ శరణు వేడితినీ 

 నీ ప్రేమని వర్షించి ,నీ కృపను  కురిపించి

చల్లగా చూడుము తండ్రీ  , మా  బంగారు తండ్రీ  

పరమ దయాళా  నన్ను బ్రోవగ రావేలా?

దయా సాగరా కరుణించగ రా దేవా 

భగవాన్ నీ చరణాలే నమ్మితినీ 

నా రోదన విని, నా వేదన కని 

కలత తీర్చుము తండ్రీ  , మా  బంగారు తండ్రీ