Sunday, July 22, 2012

Jaya Sai


దయ గల వాడివయా

  దీన నాథా హే  జగన్నాథా 

బంగారు మా తండ్రివయా

 సంకట నాశా హే పరమేశా

జయ సాయి జయ సాయి జయ జయ సాయి

పండరి  లో వెలసిన

పాండురంగా హే  సాయి రంగా

ద్వారకామాయిలో కొలువున్న 

దయామయీ హే షిర్డిసాయీ

జయ సాయి జయ సాయి జయ జయ సాయి 

ఆది పురుషా హే జగదాశ్రితప్రభు సాయీశా

 జ్ఞ్యా న ప్రభోధకా హే   దేవాగణాధి పూజిత పర్తీశా

జయ సాయి జయ సాయి జయ జయ సాయి

మహిమ గల వాడివయా

 లోకనాథా హే సాయి నాథా 

మా అందరి   బంధువయా

  త్రిభువన పరిపాలా హే సాయి గోపాలా 

జయ  సాయి జయ సాయి జయ జయ సాయి