Sunday, July 29, 2012

Sai Naam



 

भजो साईं नाम सुखदायी 

साईं साईं भजो तो सुकून मिल जाए 

जपो साईं नाम   दुखहारी 

साईं साईं जपो तो बेचैनी हर जाए 

बोलो साईं नाम संकट निवारिणी 

साईं साईं बोलो थो अड़चन हट जाए 

मधुर मनोहर नाम साईं राम साईं राम 

सुन्दर सुहावना नाम साईं राम साईं राम 

पवित्र पावन नाम साईं राम साईं राम 

भावमय रसमय नाम साईं राम साईं राम 




Friday, July 27, 2012

Bangaaru Sai








భక్త వత్సలా నా బాధ బాపగ రావేలా ?

శ్రిత  జన పోషా నా మొర విన రావా దేవా 

భగవాన్  నీ శరణు వేడితినీ 

 నీ ప్రేమని వర్షించి ,నీ కృపను  కురిపించి

చల్లగా చూడుము తండ్రీ  , మా  బంగారు తండ్రీ  

పరమ దయాళా  నన్ను బ్రోవగ రావేలా?

దయా సాగరా కరుణించగ రా దేవా 

భగవాన్ నీ చరణాలే నమ్మితినీ 

నా రోదన విని, నా వేదన కని 

కలత తీర్చుము తండ్రీ  , మా  బంగారు తండ్రీ 


Sunday, July 22, 2012

Jaya Sai


దయ గల వాడివయా

  దీన నాథా హే  జగన్నాథా 

బంగారు మా తండ్రివయా

 సంకట నాశా హే పరమేశా

జయ సాయి జయ సాయి జయ జయ సాయి

పండరి  లో వెలసిన

పాండురంగా హే  సాయి రంగా

ద్వారకామాయిలో కొలువున్న 

దయామయీ హే షిర్డిసాయీ

జయ సాయి జయ సాయి జయ జయ సాయి 

ఆది పురుషా హే జగదాశ్రితప్రభు సాయీశా

 జ్ఞ్యా న ప్రభోధకా హే   దేవాగణాధి పూజిత పర్తీశా

జయ సాయి జయ సాయి జయ జయ సాయి

మహిమ గల వాడివయా

 లోకనాథా హే సాయి నాథా 

మా అందరి   బంధువయా

  త్రిభువన పరిపాలా హే సాయి గోపాలా 

జయ  సాయి జయ సాయి జయ జయ సాయి

Tuesday, July 17, 2012

Hrudayanjali



 

విశ్వమానవ కళ్యానానికై  నిర్విరామ కృషి చేసావు

అలుపెరగని బాటసారిగా సాగిపోయావు

సాయి నీ మేలు ఎన్నటికి మరువం

నీవు చూపిన బాటలోనే మా పయనం

మానవాభ్యుదయానికై  అహర్నిశలు పాటు పడ్డావు

భరత మాత ముద్దు బిడ్డ గా కీర్తి గడించావు

సాయి నీ సేవా తత్వానికి శత కోటి జోహారులు

నీ దివ్య పథంలోనే సాగి పోతాయి మా జీవితాలు

ప్రేమే దైవమని సేవే దైవారధనని తెలియపరిచావు

నీ సందేశంగా నీ జీవితాన్నే మలుచుకున్నావు

సాయి నీ  ప్రేమ తత్వానికి హృదయాంజలి

మానవ సేవ కే జీవితాన్ని ధార పోసిన నీకు భాష్పాంజలి




  

Monday, July 16, 2012

Sai Sharanam

 

నీలో నేను నాలో నీవు ఇరువురం ఒకరే సాయి

ఈ పరమార్థం భోధ పరచి జ్ఞానోదయం కలిగించావు

 జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు 

ఇందులో అందులో వీరిలో వారిలో అంతా నీవే స్వామీ

భిన్నత్వం రూపుమాపి ఏకత్వం అలవరుచుకోమన్నావు

జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీగురు

పశు ప్రవుత్తులు అణుచుకుని

మానవ విలువలు పెంచుకుని

మనిషిలా జీవించ మన్నావు

జయ గురు,సద్గురు సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు 

మానవత్వాన్ని మరిచి మరిచిన మనిషి

ప్రేమతత్వాన్ని నేర్చి దివ్యత్వాన్ని పొందాలని పరితపించావు

జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు

మానవ రూపం దాల్చిన పరమేశా

దివ్య సందేశాలిచ్చి మమ్ము పవిత్రం చేసావు

 జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు 

అవతార పురుషా మహానుభావా మాలో ఒకడివై

మాయ చేస్తూ భువిపై సంచరించావు

జయ గురు,సద్గురు,సాయి గురు,మహా గురు,శరణం శ్రీ గురు

మా జన్మ ధన్యమాయే  కదా నీ అపార దయ వలన

ఏ లోకాన ఉన్నా దీవిస్తూ ఉండు కురిపిస్తూ నీ కరుణ  

జయ గురు సద్గురు సాయి గురు మహా గురు శరణం శ్రీ గురు 

 


Thursday, July 12, 2012

Sai Ram









 
 
 

ఘన కీర్తిని గడించిన మహిమాన్వితుడు సాయి

తన ఆశయాలకు  జీవితం అంకితం చేసాడు

ఆ సాయి నాథుడే మా ఆరాధ్య దేవుడు

రామ్ సాయిరాం జై జై రాం సాయి రాం

త్రికాల జ్ఞాని కాలాతీతుడు సాయి

ఎల్లకాలం నిలిచిపోవు ఖ్యాతి గడించాడు

ఆ సాయి నాథుడే మా ప్రియాతిప్రియ దేవుడు

రాం సాయిరాం జై జై రాం సాయిరాం

కరుణా సముద్రుడు కలియుగ భగవానుడు సాయి

కుల మతాలకతీతంగా కొలవబడుతున్నాడు

 ఆ సాయి నాథుడే మా సద్గురు దేవుడు

  రామ్ సాయి రాం జై జై రాం సాయి రాం


Wednesday, July 11, 2012

Maa Sai Baba


ఆత్మ జ్ఞానము తెలియ పరిచిన  తత్వ జ్ఞానివి నీవు

మా మనస్సులో నిత్యం నిలిచి ఉంటావు

బాబా మా సాయి బాబా

సత్య ధర్మ శాంతి ప్రేమలను ప్రబోధించిన బ్రహ్మ జ్ఞానివి నీవు

మా హృదయాలలో సదా కొలవుంటావు

బాబా మా సాయి బాబా

మానవతా విలువలను నేర్పిన సద్గురు మూర్తివి నీవు

మాతలపులలో ఎల్లవేళలా నడయాడుతుంటావు

బాబా మా సాయి బాబా

శివ శక్తి అంశతో అవతరించిన లీలా మానుష వేష ధారివి నీవు

కలియుగ దైవం గా కలకాలం కీర్తించ బడతావు

బాబా మా సాయి బాబా














Tuesday, July 3, 2012

Sathya Sai Prema Sai




నిత్య చైతన్య సత్య స్వరూపా సాయీ

ప్రేమనిలయా ప్రశాంతినికేతనా సత్య సాయి

సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ

మమతల కోవెల చల్లని వెన్నెల సాయీ

మన్మొహనా చిత్తరంజనా సత్య సాయి

సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ

మనోవాంఛా సిద్దిదాయకా  సుజ్ఞ్యాన బోదకా సాయీ

మంగళ ప్రదాయకా సంచిత పాప వినాశకా సత్యసాయి

సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ 

షిర్డీ నాథ ప్రభో పర్తిపురివిభో సాయీ

దత్తాత్రేయ స్వరూపా త్రినేత్ర శివా పరాశక్తి రూపా సత్యసాయి

సాయీ సత్యసాయీ రావోయీ ప్రేమ సాయీ