Sai Maatha
కన్నీళ్ళని కట్టడి చేసి
ఎగిసి పడే ఆనంద తరంగాలకి ఆన కట్ట వేసాను
సుఖ దుఃఖాల ని సమ తుల్యంగా భావించాలి
అందుకు నీ దివ్య ఆశీస్సులు కావాలి
సాయీశా సదా సన్మార్గము చూపుమా
విధాతా నిరతము మార్గ దర్శకము గావింపుమా
సాయి మాతా నా విన్నపము ఆలకించుమా
జగన్మాతా కనికరించుమా
కల్లోల్లమైన హృదయంలో
సత్య ధర్మ పథం అనే తివాచి పరిచాను
శాంతిని ప్రసాదిస్తూ ప్రేమగా నీవు నడిచి రావాలి
అందుకు నీ కృపా కటాక్షము కావాలి
ప్రాణే శా నా ప్రతి శ్వాసలో నిండి ఉండుమా
భగవంతా బ్రతుకంతా తోడు ఉండుమా
సాయి మాతా నా విన్నపము ఆలకించుమా
జగన్మాతా కనికరించుమా