Friday, August 24, 2012

Atma Rama

 

నీ రూపాన్ని మదిలో పదిలపరుచుకుంటా

నీ బాటలో నడిచి నిన్నే చేరుకుంటా

ఆత్మా  రామా  సాయి  రామా

ఎన్ని ఎదురు గాలులు వీచినా మది నుండి నీ రూపం చెదరదు

ఎన్ని అవాంతరాలు వచ్చినా నీ వైపు నా పయనం ఆగదు

ఆత్మా రామా సాయి రామా

ఏ జన్మ కైనా కొలవాలి నిన్నే నా ఇలవేల్పుగా

నీ నామమే నిలవాలి నా అంతిమ తలపుగా

ఆత్మా రామా సాయి రామా