Monday, May 14, 2012

Sai Neevekkada?



సహస్ర మాతల ప్రేమని పంచి 

లీల మానుష వేష ధారివై మమ్మలరిస్తూ 

అంతలోనే అంతర్దానమైనావా ?

నీ మోహన రూపం చూడాలనే మరీ మరీ అనిపించినా 

నిన్నెక్కడ వెదకాలీ ? బాబా నిన్నెలా చూడాలీ?

సద్భక్త హృదయ వాసివని గుర్తించాలీ.

నిర్మల హృదయం నీకు అర్పించాలీ  

 

సత్య  ధర్మ శాంతి ప్రేమలను భోధించి

జగన్నాటక  సూత్రదారివై మమ్మల్నాడిస్తూ

 అంతలోనే కనుమరుగైనావా?

నీ తేనెలూరు మాటలు వినాలని పదే పదే అనిపించినా 

నిన్నెక్కడ వెదకాలీ ?బాబా నిన్నెలా చూడాలీ?

సర్వం సాయిమయమని గుర్తిన్చాలీ? 

సకల జనులయందు నిన్ను దర్శించాలీ.