తలచితి నీ నామం అలుపెరుగక నేనెపుడూ
భజించితి నీ నామం మది రంజిల్లగా ఎల్లపుడూ
సాయి నా తోడు వీడకోయీ
సాయి నీ కీర్తనలెంతో హాయి
నీ దానను నేను నను వీడకు సాయి
నీ గానమే నా ప్రాణము నేనసలు మరువనోయీ
రామ్ రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్
శ్యాం శ్యాం ఘన శ్యాం నీల మేఘ శ్యాం
అనుదినము నీ చింతన అదే నాకు రక్షణ
అడుగడుగున నీ అభయం సాయి నీ దీవెన
నీ ధ్యాసయే శ్వాసయైన మీరా నైన కాకపోతి
నీ పూజలో నెల రాలే పూవు నైనా కాకపోతి
రామ్ రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్
శ్యాం శ్యాం ఘన శ్యాం నీల మేఘ శ్యాం